- కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్మీటింగ్లో కౌన్సిలర్ల నిర్ణయం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్కమిషనర్ రాజేందర్‌రెడ్డి, టీపీవో గిరిధర్‌ను సరెండర్ చేసేందుకు మున్సిపల్ బడ్జెట్మీటింగ్లో కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ఇప్ప ఉమారాణి అధ్యక్షతన శనివారం బడ్జెట్మీటింగ్జరిగింది. బడ్జెట్చర్చ కంటే ముందు ఆయా వార్డుల్లో సమస్యలపై సభ్యులు ప్రస్తావించారు. ప్రధానంగా శానిటేషన్, నీటి సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. సమస్యలను కమిషనర్, టీపీవో పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆరోపించారు. తాను ఫోన్‌చేసినా కమిషనర్ స్పందించట్లేదని చైర్పర్సన్ పేర్కొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్, టీపీవో సరెండర్‌కు సభ్యులు తీర్మానం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అడిషనల్కలెక్టర్మధుమోహన్ పేర్కొన్నారు. 2026–26 ఆర్థిక ఏడాదికి బడ్జెట్‌ను అమోదించారు. పన్నులు, కిరాయిలు, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా మొత్తం రూ. 7.86 కోట్ల ఆదాయం, రూ.70.85 కోట్ల ఖర్చులకు అమోదం తెలిపారు.
