
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 35 స్థానాల్లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించే సంఖ్యలో కమ్మవారు ఉన్నారని కమ్మ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో 15 లక్షల మంది ఓటర్లున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 నుంచి 6 శాతం వరకు కమ్మ ఓటర్లున్నారని, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 2.6 లక్షల మంది ఓటర్లున్నారని వివరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4,14,500 మంది కమ్మ ఓటర్లున్నారని తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో కమ్మ ఓటర్లున్నారని పేర్కొన్నారు.