అర్హులందరికీ దళిత బంధు అందేలా చూస్తా : కందాల ఉపేందర్ రెడ్డి

అర్హులందరికీ దళిత బంధు అందేలా చూస్తా : కందాల ఉపేందర్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు : అర్హులందరికీ దళితబంధు అందేలా చూస్తానని, మరోసారి తనను గెలిపించాలని పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కోరారు. మంగళవారం ఖమ్మం రూరల్​ మండలంలోని సాయిగణేశ్​ నగర్ లోని తన క్యాంప్ ఆఫీస్​లో మానుకొండ శ్రీను ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమ్మేళనంలో కందాల మాట్లాడారు. తన ఆశయం, తన కోరిక దళిత, గిరిజన బిడ్డలని చదివించడమేనని తెలిపారు. జనం తనతోనే ఉన్నారని తనను మోసం చెయ్యబోరని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, నాయకులు పాలకుర్తి కృష్ణ, ఇటీ కిషోర్, కోట నాగేశ్వరరావు, వంగూరి యాకయ్య, ప్రభుదాసు, గుగ్గిళ్ల ప్రభాకర్ పాల్గొన్నారు.

కూసుమంచి :  తిరుమలాయపాలేం మండలంలో హైదర్ సాయిపేటలో నిర్వహించిన ప్రచారంలో కందాల ఉపేందర్​రెడ్డి మాట్లాడారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్​ఎస్​ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో  వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, డీసీసీబి డైరెక్టర్ చావా వేణుగోపాల్, మండల అధ్యక్షుడు వీరన్న తదితరులు పాల్గొన్నారు.