రేపు స్వగ్రామంలో కందికొండ అంత్యక్రియలు

రేపు స్వగ్రామంలో కందికొండ అంత్యక్రియలు

ప్రముఖ కవి, రచయిత  కందికొండ యాదగిరి కుటుంబానికి ఇల్లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం . చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్రూమ్ ను మంజూరు చేసింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రోద్బలంతో ఇల్లు మంజూరు చేసింది. కేసీఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు కందికొండ కుటుంబసభ్యులు.

కందికొండ అంత్యక్రియలు రేపు తన స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరగనున్నాయి. తొలుత ఫిలింనగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ బంధువుల కోరిక మేరకు సొంతూరులో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. కందికొండ  భౌతికకాయానికి  ఫిలిం చాంబర్ లో  సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు.  సాయంత్రం ఆయన సొంతూరు నాగుర్లపల్లికి పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. రేపు ఉదయం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.