న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.. ఇంటర్నేషనల్ టీ20లకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. అయితే వన్డే,టెస్టు ఫార్మాట్ లో కొనసాగుతానని చెప్పాడు. 2026 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
కేన్ మామ అని ముద్దుగా పిలుచుకునే హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. 35 ఏళ్లకే టీ20లకు గుడ్ బై చెప్పడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
2011లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన విలియమ్సన్ చివరి మ్యాచ్ 2024లో ఇంగ్లాండ్ పై ఆడాడు. టీ20 ఫార్మాట్ లో న్యూజిలాండ్ తరపున రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విలియమ్సన్ . 33.44సగటుతో 18 హాఫ్ సెంచరీలు , 95 అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 2,575 పరుగులు చేశాడు. అతను తన 75 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించాడు. వీటిలో 2016, 2022లో టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కు తీసుకెళ్లగా... 2021లో జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు కానీ గెలిపించలేకపోయాడు.
