కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘భారత్ భాగ్య విధాత’. మనోజ్ తపాడియా దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నర్స్‌గా కంగనా కనిపించారు.
2008 ముంబై టెర్రర్ అటాక్ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సమయంలో అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించిన నర్సులు, వార్డ్ బాయ్స్, క్లీనర్స్, లిఫ్ట్ ఆపరేటర్లు, సెక్యూరిటీ సిబ్బంది లాంటి అన్‌సంగ్ హీరోస్‌కు నివాళిగా ఈ సినిమా ఉండబోతోంది.
తాము సర్వస్వం కోల్పోయినా ఎలాంటి గుర్తింపును ఆశించని సాధారణ ప్రజల త్యాగాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉందని కంగనా రనౌత్ తెలిపారు.
గిరిజా ఓక్, స్మితా తాంబే, అమృతా నామ్‌దేవ్, ఈషా డే, ప్రియా బెర్డే, ఆశా షేలార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కంగనకు చెందిన మణికర్ణిక ఫిల్మ్స్‌తో కలిసి పెన్ స్టూడియోస్, పరమహంస క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జూన్ 12న సినిమా విడుదల కానుంది.
