హైదరాబాదులో చంద్రముఖి 2 షూటింగ్ షురూ

హైదరాబాదులో చంద్రముఖి 2 షూటింగ్ షురూ

బ్లాక్ బస్టర్ హిట్ తమిళ్ హారర్ కామెడీ మూవీ చంద్రముఖికి సీక్వెల్ చంద్రముఖి 2 రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. అందుకోసం నటి కంగనా రనౌత్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రాం ద్వారా తెలియజేశారు. చంద్రముఖి 2 రెండో షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యానని ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో ఆకుపచ్చ చీర ధరించిన ఆమె.. ఫ్లైట్ లో కిటికీ దగ్గర కూర్చొని ఉన్న పిక్ యాడ్ చేశారు. పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో వచ్చిన తమిళ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

చంద్రముఖి 2 లో కంగనా... రాజు ఆస్థానంలోని నర్తకి పాత్రను పోషించనుంది. కంగనా సరసన తమిళ నటుడు రాఘవ లారెన్స్ కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ ఇంకా వెలువడలేదు. ఇక కంగనా తదుపరి సినిమాల విషయానికొస్తే.. పీరియాడికల్ డ్రామా చిత్రం ఎమర్జెన్సీలోనూ నటిస్తున్న కంగనా.. తొలిసారి సోలోగా దర్శకత్వం వహిస్తోంది. దాంతో పాటు తేజస్, మణికర్ణిక రిటర్న్స్, ది లెజెండ్ ఆఫ్ దిద్దా, ది అవతారం : సీతలోనూ కంగనా నటించనుంది.