ఇన్నాళ్లకు తెలిసిందా : వాళ్ల గురించి మాట్లాడితే.. అంతా లాస్

ఇన్నాళ్లకు తెలిసిందా : వాళ్ల గురించి మాట్లాడితే.. అంతా లాస్

Kangana Ranaut : నటి కంగనా రనౌత్ బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పటికే.. బాలీవుడ్ ఒక మాఫియా అంటూ పలువురు ప్రముఖులపై  విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక కంగనా ఓపక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. దేశం, ధర్మం గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళని బహిరంగంగానే విమర్శించడం ఆమెకు అలవాటే.  వాటిపై సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉంటుంది.

ఇక తాజాగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇంటరెస్టింగ్ పోస్ట్ చేసింది. ఇటీవల ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్.. నేను నాకిష్టమైందే చేస్తాను, నమ్మిన దానిపై నిలబడతాను, దాని వల్ల డబ్బులు పోయినా పర్లేదు అని కామెంట్ చేసాడు. ఎలాన్ చేసిన ఈ వ్యాఖ్యలను తన స్టోరీలో షేర్ చేసిన కంగనా.. ఆ వ్యాఖ్యలకు సపోర్ట్ గా నిలిచింది. నేను కూడా హిందుత్వం గురించి, రాజకీయ నాయకులు, దేశ వ్యతిరేకుల గురించి మాట్లాడటం వల్ల 20 నుంచి 25 బ్రాండ్ ఎండార్స్మెంట్  లను కోల్పోయాను.

సినిమాల నుంచి కూడా తప్పించారు. దానివల్ల నాకు సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల నష్టం వస్తోంది. కానీ నేను స్వేచ్ఛగా ఉన్నాను. నాకు నచ్చింది మాట్లాడుతున్నాను. ఈ విషయంలో నేను ఎలాన్ ని అభినందిస్తున్నాను.దీంతో మరోసారి కంగనా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.