చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన కంగనా రనౌత్

చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన కంగనా రనౌత్

ప్రముఖ నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్న 'ఎమర్జెన్సీ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషించనుంది. ఈ మూవీలో ఆమె లుక్ కు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేసినపుడు కంగనా, ఇందిరా లుక్ లో అదిరిపోయిందనే ప్రశంసలనూ అందుకుంది. అప్పట్నుంచి కంగనాను అందరూ ఇందిరా గాంధీ అని పిలుస్తున్నారట. అయితే ఈ విషయంపై స్పందించిన కంగనా.. తాజాగా తన చిన్ననాటి ఫొటోలను షేర్ చేసింది. తనను ఇప్పుడు ఇందిరా అని పిలుస్తున్నారు గానీ..  చిన్నతనంలోనే తనను తన బంధువులు ఇందిరా గాంధీ అని పిలిచేవారని చెప్పుకొచ్చింది.

కంగనా షేర్ చేసిన తన చైల్డ్ వుడ్ ఫొటోలలో ఒకటి స్కూల్ యూనిఫాన్ లో హెయిర్ కట్ చేసుకొని ఉన్న పిక్ కాగా, మరొక పిక్ లో క్యూట్ లుక్స్ తో అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలతో పాటు కంగనా కొన్ని ఆసక్తికర విషయాలనూ పంచుకుంది. తాను చిన్నతనంలో ఎవరి హెయిర్ స్టైల్ నూ ఫాలో అయ్యేదాన్ని కానని, తనకు నచ్చిన హెయిర్ స్టైల్ ను బార్బర్ చెబితే... అతను చెప్పినట్టు చేసేవాడని తెలిపింది. ఆ హెయిర్ కట్ చూసి అందరూ నవ్వేవారని, తన బంధువుల్లో కొందరైతే ఇందిరా గాంధీ అని పిలుస్తూ ఆటపట్టించేవారని చెప్పుకొచ్చింది. 

https://www.instagram.com/stories/kanganaranaut/2929964618506136166/?hl=en