
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీలో కనిపించేది ఇద్దరు సూర్యలు అనే కన్ఫర్మేషన్ ఇచ్చారు మేకర్స్.అలాగే 2024లో కంగువ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు కూడా ప్రకటన చేశారు.అయితే ఇక్కడ రిలీజ్ డేట్ అనేది ప్రస్తావించలేదు.
Where the past and present collide, a new future begins ?️#Kanguva ? Releasing 2024 in cinemas worldwide. #HappyTamilNewYear✨@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP @StudioGreen2 @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @PenMovies #PenMarudhar… pic.twitter.com/b0lVDt4rbN
— Kanguva (@KanguvaTheMovie) April 14, 2024
పోస్టర్ని బట్టి కథని గమనిస్తే..
ఈ కొత్త పోస్టర్ లో సినిమా థీమ్ ఏంటో ఊహించుకోవడానికి చాలా విషయాలే ముందు ఉంచారు. గతం, వర్తమాన కాలల్లో కంగువ మూవీ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. "ఎక్కడైతే గతం, వర్తమానం ఒకదానికొకటి తలపడతాయో అక్కడే కొత్త భవిష్యత్తు ఉద్భవిస్తుంది" అంటూ ఉన్న క్యాప్షన్ కథపై ఆసక్తిని పంచుతోంది.
అంతేకాదు ఈ కథ రెండు కాలాల్లో సాగుతూ ఒకే వ్యక్తి రూపాలను ఆవిష్కరిస్తూ..ఒక పాత్రలో అసాధారణ శక్తులతో కూడిన శక్తివంతమైన గిరిజనుడిగా, మరొక పాత్రలో మోస్ట్ పవర్ ఫుల్ కార్పొరెట్ డాన్ గా అతడు సూర్య పవర్ ఫుల్గా కనిపిస్తున్నాడు.అలాగే ఇక్కడ మరొక ఇంట్రస్టింగ్ విషయం కనిపిస్తుంది.
మోడర్న్ సొసైటీలో ఉన్న సూర్యకి..గిరిజన తెగలో బ్రతికే సూర్యకు మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఒకరు గిరిజనుడిగా కత్తిని చేత పడితే, మోడ్రన్ బాస్ క్యారెక్టర్ మెషీన్ గన్ తో ఇంటెన్స్ కలిగిస్తున్నాడు.
అంతేకాకుండా..గిరిజనుడిగా కనిపించే సూర్య ఒంటిపై పచ్చబొట్టు, మెడలో పుర్రెలతో కూడి దండలు ఉన్నాయి. అతడి వెనుక అడవి తగలబడుతోన్నట్లుగా పోస్టర్ లో చూపించారు. మరోవైపు మోడ్రన్ బాస్ వెనకాల ఉన్న బిల్డింగ్‌లు తగలబడిపోతున్నట్లుగా పోస్టర్‌ను డిజైన్ ఉంది. మరి ఈ రెండు కథలకు ఎలా లింక్ చేస్తూ..ఆసక్తి పెంచుతారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో అడవిలో విలన్గా కనిపించే బాబీ డియోల్ పాత్ర కూడా రెట్టింపు ఇంటెన్స్ ను కలిగించింది. కంగువలో పచ్చని అటవీ ప్రాంతం, గ్రామీణ వాతావరణంతో సరికొత్త విజువల్ ఫెస్ట్ ని అందిస్తుంది అనడంలో సందేహం లేదు.
300 నుంచి 350కోట్ల బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పాలపాటి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది.
3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా..2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.