
కన్నడ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ (Darshan) నటించిన లేటెస్ట్ మూవీ కాటేరా (Kaatera). ఈ మూవీ గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ అయింది. కన్నడ భాషలోనే రిలీజైన ఈ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కేవలం కన్నడలో ఫిబ్రవరి 9న ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 లోకి రిలీజై దూసుకెళ్లింది. అంతేకాదు ఓటీటీలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే కాటేరా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది.
లేటెస్ట్గా ఈ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ తెలుగులో ఓటీటీ ద్వారా ఆదివారం (ఏప్రిల్ 14న)ప్రేక్షకుల ముందుకొచ్చింది.కాటేరా తెలుగుతో పాటు తమిళ వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నట్లు జీ5 ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
కాటేరా రిలీజైన ఐదు నెలల తర్వాత తెలుగు ఓటీటీ ద్వారా ఆడియన్స్ను పలకరించబోతుంది.దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు నేటితో కాటేరా దర్శనం కాబోతుంది.
సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తోతెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రూ.104కోట్ల కలెక్షన్లను సాధించింది. రాక్‍లైన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్పై రాక్‍లైన్ వెంకటేశ్ నిర్మించిన కాటేరా చిత్రానికి వి.హరికృష్ణ మ్యూజిక్ అందించారు.
కాటేరా స్టోరీ విషయానికి వస్తే..
భూస్వాముల చేతుల్లో రైతులు, నిమ్నవర్గాల ప్రజలు అణచివేతకు గురవడం వంటి ప్రధాన అంశాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ముసలితనంలో ఉన్న కాటేరా (దర్శన్) జైలులో కనిపించడంతో సినిమా మొదలవ్వగా..పెరోల్‍పై తన గ్రామానికి కానిస్టేబుల్ (అచ్యుత్ కుమార్)తో పాటు వెళతాడు. ఆ తర్వాత అక్కడ కాటేరాపై ఒక భయంకరమైన దాడి జరుగుతుంది. అప్పుడు 1970ల కాలంలో జరిగిన విషయాలను కానిస్టేబుల్‍కు కాటేరా వివరిస్తాడు. దీంతో అసలు కథ షురూ అవుతుంది.
1970 సమయంలో రైతులకు భూములు దక్కేలా కాటేరా చేయగలిగాడా? భూస్వాముల నుంచి పేద రైతులను రక్షించాడు.? భూస్వాములు చేసే దాడులను ఎలా ఎదుర్కొన్నాడు? అలా గ్రామంలో దొరిగిన అస్థిపంజరాలతో కాటేరాకు ఉన్న సంబంధం ఏంటి? అతడు జైలుకు ఎందుకు వెళ్లాడు? అనే అంశాలతో ఆసక్తికరమైన కథనంతో నడుస్తుంది.