Shiva Rajkumar: మరోసారి ఆసుపత్రిలో చేరిన శివరాజ్ కుమార్..అసలు ఏమైందంటే?

Shiva Rajkumar: మరోసారి ఆసుపత్రిలో చేరిన శివరాజ్ కుమార్..అసలు ఏమైందంటే?

కన్నడ సినీ రంగంలో 'శివన్న'గా గుర్తింపునందుకొని వరుస సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌(Shiva Rajkumar)‌‌‌. ఆయన ఇటీవలే (ఆదివారం) తన భార్య గీతా శివరాజ్‌కుమార్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ప్రచారంలో పాల్గొని అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కోలుకుని మళ్ళీ సోమవారం డిశ్చార్జ్ కూడా అయ్యాడు.

తాజా సమాచారం ప్రకారం..శివన్న మరోసారి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్ సెట్స్‌లో విపరీతమైన దుమ్ము రేగడంతో వైద్యుల సలహా మేరకు..రొటీన్ పరీక్షల కోసం మళ్లీ ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం.ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ బాగానే ఉన్నారని, రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు తెలిపారు. దీంతో శివన్న బాగుండాలంటూ ఫ్యాన్స్ ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. 

శివరాజ్ కుమార్‌‌‌‌ ఇటీవలే రజినీకాంత్ ‘జైలర్‌‌‌‌’లో కనిపించింది కాసేపు అయినప్పటికీ..ఆ పాత్ర ఎంతో పేరు తెచ్చింది. అలాగే జైలర్ 2 లో అతని పూర్తి పాత్రకి సంబంధించిన  సీన్స్ కూడా వస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు చరణ్ ప్రాజెక్ట్ తో పాటు మంచు విష్ణు కన్నప్ప మూవీలో నటిస్తున్నారు.