రోడ్డు ప్రమాదంలో యువ నటి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువ నటి దుర్మరణం

చెన్నై: రోడ్డు ప్రమాదంలో కన్నడ టెలివిజన్ యువ నటి మెబీనా మైఖేల్(22) చనిపోయారు. సొంతూరు కర్నాటకలోని మాడికేరికి వెళ్తుండగా దేవనహళ్లి దగ్గరలో ఆమె కారు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెబీనాతో పాటు ఆమె స్నేహితులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారందరినీ ఆస్పత్రికి తరలించగా మెబీనా చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె స్నేహితులు కోలుకుంటున్నారు. మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన మెబీనా పయాటే హుదుగిర్ హల్లి లైఫ్ రియాల్టీ షోతో స్టార్​డమ్ సంపాదించుకున్నారు. ఆమె మరణవార్తతో కన్నడ పరిశ్రమ షాక్​కి గురైంది. మెబీనా మృతి పట్ల రియాల్టీ షో హోస్ట్ అకుల్ బాలాజీ ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేశారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్ మరణవార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఇంత చిన్న వయసులో ఆమె మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.