గోదావరిఖని, వెలుగు: కాన్పూర్ నుంచి మధురై వరకు నడిచే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 01925/01926) గురువారం నుంచి రామగుండం రైల్వే స్టేషన్‌లో ఆగనుంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషితో ఈ రైలుకు హాల్టింగ్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది. కాన్పూర్ నుంచి మధురైకి ప్రారంభమైన ఈ రైలును రామగుండంలో నిలుపుదల చేయాలని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌తో మాట్లాడారు.
కాగా ఈ రైలు రామగుండంలో గురువారం తెల్లవారుజామున 5.20 గంటలకు రానుండగా, తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లే వారికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎంపీకి దక్షిణమధ్య రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్ అనుమాస శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
