V6 News

ధనుష్ కర కంటెంట్‌‌‌‌‌‌‌‌పై నమ్మకంతో ఉన్నాం: సీహెచ్. సతీష్ కుమార్

ధనుష్ కర కంటెంట్‌‌‌‌‌‌‌‌పై నమ్మకంతో ఉన్నాం: సీహెచ్. సతీష్ కుమార్

ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేష్‌‌‌‌‌‌‌‌ రాజా తెరకెక్కించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్వర ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి.  గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా తెలుగులో విడుదల చేస్తున్న సీహెచ్. సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘అర్జున్ రెడ్డి, కబాలి, సింగం 3, సలార్, కాంతారా లాంటి చిత్రాలను ఉత్తరాంధ్రలో పంపిణీ చేసిన నేను ధనుష్ గారి ‘ధర్మయోగి’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాను. ఇప్పుడు మరోసారి ధనుష్‌‌‌‌‌‌‌‌ గారి సినిమాతో వస్తున్నా. తెలుగులో ఆయనకు ఉన్న మార్కెట్‌‌‌‌‌‌‌‌ దృష్ట్యా గట్టి పోటీ ఎదురైంది.

స్ట్రాంగ్, ఎమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమా వస్తోంది.  ఓ సాధారణ మనిషి తమకు ఎదురైన సమస్యల్ని ఎలా అధిగమించాడు అన్నది  దర్శకుడు ఆసక్తికరంగాచూపించారు. జీవీ ప్రకాష్‌‌‌‌‌‌‌‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు.  సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ధనుష్​. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పారు.