బాలీవుడ్‌లోకి ‘డియర్ కామ్రేడ్’

బాలీవుడ్‌లోకి ‘డియర్ కామ్రేడ్’

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 26 న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ చిత్రం హిందీలో కూడా రానుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహర్‌  ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ రైట్స్ ను తాను సొంతం చేసుకున్నట్టు తెలిపారు కరణ్ జోహార్. ఈ సినిమాని హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ రీమేక్ చేయబోతోందని తెలుపడానికి ఆనందిస్తున్నాను అని చెప్పారు. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు.

తాను సినిమా చూశానని, విజయ్, రష్మికలు అద్భుతంగా నటించారని ట్వీట్ చేశారు. భరత్‌ కమ్మ అత్యద్భుతంగా చిత్రీకరించారని, జస్టిన్‌ ప్రభాకరన్ సంగీతం బాగుందని తన ట్వీట్ లో తెలిపారు.