
కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి కీలక పాత్రలో దర్శకుడు గురుదత్ గనిక రూపొందిస్తున్న చిత్రం ‘కరావళి’. జంతువు వర్సెస్ మానవుడు ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా.. తాజాగా రాజ్ బి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రాజ్ బి శెట్టి.. మవీర్ పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు.
రెండు గంభీరమైన గేదెల పక్కన నిలబడి ఉన్న తీరు, చేతిలో కాగడతో ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు గురుదత్ మాట్లాడుతూ ‘కర్నాటక తీరప్రాంత ఆచారాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో రాజ్ బి శెట్టి క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుంది. ఆయన మవీర పాత్రకు ప్రాణం పోశారు’ అని చెప్పాడు.
ఈ చిత్రంలో మిత్రా, రమేష్ ఇందిరా, సంపద ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వీకే ఫిల్మ్ అసోసియేషన్, గనిగా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివర దశల్లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతోన్నారు.