V6 News

సిబ్బంది సంక్షేమం కోసం సౌకర్యాల పెంపు

సిబ్బంది సంక్షేమం కోసం సౌకర్యాల పెంపు

హుజూరాబాద్, వెలుగు: పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం హుజూరాబాద్ పోలీస్‌‌స్టేషన్‌‌లో కొత్తగా నిర్మించిన ‘అమరవీరుల స్మారక బ్యారక్’ విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.

నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీస్ సిబ్బందికి మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల మరింత ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో ఏసీపీ వి.మాధవి, సీఐలు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు తిరుపతి, స్వాతి, క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు.