కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌ లో మెగా జాబ్‌‌‌‌ మేళాకు అనూహ్య స్పందన ..3 వేల మందికి పైగా హాజరు 

కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌ లో మెగా జాబ్‌‌‌‌ మేళాకు అనూహ్య స్పందన ..3 వేల మందికి పైగా హాజరు 
  • వారిలో 997 మంది ఎంపిక.. 478 మందికి ఆఫర్ లెటర్లు 
  • ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం 
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఐటీ, నాన్‌‌‌‌ ఐటీ, హెల్త్‌‌‌‌కేర్, ఆర్గానిక్, డెయిరీ, అగ్రికల్చర్ తదితర రంగాలకు చెందిన సుమారు 90 కంపెనీలు ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు.

వీరిలో 997 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 478 మందికి వివిధ కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. అభ్యర్థుల సౌకర్యార్థం మొత్తం 95 స్టాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. 

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో మూడు నెలలకోసారి జాబ్‌‌‌‌మేళాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అధికారులంతా సమన్వయంతో జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు.

రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని జాబ్ మేళాలను ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి, వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతామని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మహేశ్వర్‌‌‌‌‌‌‌‌, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, డీవైఎస్‌‌‌‌వో శ్రీనివాస్ గౌడ్, పరిశ్రమల శాఖ జీఎం సాల్మన్ రాజు, పీడీ మెప్మా స్వరూపరాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది 
పాల్గొన్నారు.