
కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ‘వెలుగు, వీ6’ టీ20 క్రికెట్ టోర్నీలో కరీంనగర్ జట్టు సెమీ ఫైనల్ చేరింది. హుస్నాబాద్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కరీంనగర్ జట్టు 87 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యా టింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 రన్స్ భారీ స్కో రు చేసింది. ఛేజిం గ్ లో హుస్నాబాద్ 16.2 ఓవర్లలో 119 రన్స్ చేసి ఆలౌటైంది. మరో మ్యాచ్ లో మానకొండూరు, హుజూరాబాద్ జట్లు తలపడగా హుజూరాబాద్ 82 రన్స్ తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హుజూరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది. ఛేజింగ్ లో మానకొండూరు జట్టు 19.2 ఓవర్లలో కేవలం 99 రన్స్ చేసి ఆలౌటైంది. హాఫ్ సెంచరీ చేసిన హుజురాబాద్ బ్యాట్స్‌మన్ సృజన్(59) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇక్కడ మూడు రోజులుగా నిర్వహిస్తున్న టోర్నీలో లీగ్ మ్యాచ్ లు ఆదివారంతో ముగిశాయి.