స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఫామ్ లో ఉన్నప్పటికి జితేష్ ను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. వరల్డ్ కప్ ముందు సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లోనూ జితేష్ రెగ్యులర్ వికెట్ కీపర్ గా ప్లేయింగ్ 11లో ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ జట్టులో అనూహ్యంగా చోటు కోల్పోయాడు. జితేష్ స్థానంలో శాంసన్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషాన్ ను ఎంపిక చేశారు. వరల్డ్ కప్ స్క్వాడ్ లో సిజోటు కోల్పోయిన తర్వాత ఈ టీమిండియా వికెట్ కీపర్ తొలిసారి స్పందించాడు.
జితేష్ మాట్లాడుతూ ఇలా అన్నాడు "టీమిండియాలో చోటు దక్కపోవడం నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. ఎందుకంటే నేను ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో ఆడడానికి చాలా కష్టపడ్డాను. కానీ అది విధి, ఏం రాస్తే అదే జరుగుతుంది. జట్టును ప్రకటించే వరకు నన్ను తప్పించడం గురించి నాకు తెలియదు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సెలెక్టర్లు ఇచ్చిన వివరణతో నేను ఏకీభవించాను. అది సరైన కారణం. ఆ తరువాత నేను కోచ్‌లు, సెలెక్టర్లతో చర్చలు జరిపాను. వారు నాకు ఏమి వివరించాలనుకుంటున్నారో పూర్తిగా అర్థమైంది". అని జితేష్ క్రిక్‌ట్రాకర్‌తో తన విచారం వ్యక్తం చేశాడు.
ఇప్పటివరకు జితేష్ 16 టీ20 మ్యాచ్ లు ఆడి కేవలం 162 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2023లో భారతదేశం ఇండియా తరపున 7 మ్యాచ్ లు ఆడిన తర్వాత 2024లో అతను 2 టీ20లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో అద్భుతంగా రాణించి 15 మ్యాచ్‌ల్లో 261 పరుగులు చేసి భారత జట్టులో స్థానం సంపాదించాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లతో రాణించినా జితేష్ కు వరల్డ్ కప్ లో స్థానం దక్కలేదు. జితేష్ శర్మతో పాటు ఓపెనర్ శుభమాన్ గిల్ పై కూడా సెలక్టర్లు వేటు వేశారు. వీరిద్దరికి ఒక్కరే రీప్లేస్ మెంట్ గా ఇషాన్ కిషాన్ ను వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు కల్పించారు. కిషాన్ వికెట్ కీపింగ్ తో పాటు ఇన్నింగ్స్ కూడా ఆరంభించగలడు.
