ఆయా షేర్ సాంగ్ లో నాని స్టైలిష్‌‌‌‌ గా డ్యాన్స్ చేశారు: సుధన్ మాస్టర్

ఆయా షేర్ సాంగ్ లో నాని స్టైలిష్‌‌‌‌ గా డ్యాన్స్ చేశారు: సుధన్ మాస్టర్

నాని హీరోగా నటిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సాంగ్ కొరియోగ్రఫీ చేసిన సుధన్ మాస్టర్ మాట్లాడుతూ  ‘ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసే చాన్స్ ఇచ్చిన  దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు థ్యాంక్స్. ‘దసరా’ చిత్రానికి ప్రేమ్ రక్షిత్‌‌‌‌ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేశా. కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా ఇది నా తొలి అవకాశం. కచ్చితంగా నిరూపించుకోవాలనే కసితో చేశా.  నాని గారిని మరో స్థాయిలో చూపించాలనే ఆలోచనతోనే కొరియోగ్రఫీ మొదలుపెట్టా.  

అనిరుధ్ గారు, సింగర్స్, లిరిక్ రైటర్ అందరూ కలిసి అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. ఆ పాట విన్న తర్వాత అంచనాలు ఇంకా పెరిగాయి.  అలాగే ఇందులో మూమెంట్స్ అన్నీ నాని గారు పోషించిన జడల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. ఇదొక రూటెడ్ ఏరియాలో జరిగే  స్టోరీ.  అక్కడున్న  ప్రజలకి  ధైర్యాన్ని ఇచ్చే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నాని కనిపిస్తారు.  

ఈ సాంగ్ మొత్తంలో ఒక ఆటిట్యూడ్ క్యారీ చేయాలని, సిచ్యువేషన్  క్లారిటీగా చెప్పిన తర్వాతనే  కొరియోగ్రఫీ చేశా.  నాని కూడా  చాలా స్టైలిష్‌‌‌‌గా​ డ్యాన్స్ చేశారు.  ఈ ఇంట్రో సాంగ్‌‌‌‌కు సినిమా చూశాక మరింత ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు.  సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల  కానుంది.