Virat Kohli: 45 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో మూడో స్థానంలో కోహ్లీ .. తొలి రెండు స్థానాల్లో ఎవరున్నారంటే..?

Virat Kohli: 45 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో మూడో స్థానంలో కోహ్లీ .. తొలి రెండు స్థానాల్లో ఎవరున్నారంటే..?

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 2026లో తాను ఆడిన తొలి వన్డేలో 93 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆదివారం (జనవరి 11) న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్దేలో కోహ్లీ 93 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు.  కోహ్లీ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయం సాధించింది. 7 పరుగుల వ్యవధిలో సెంచరీ కోల్పోయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం గెలుచుకున్నాడు. విరాట్ వన్డే కెరీర్ లో ఇది 45 హాఫ్ సెంచరీ. ఓవరాల్ గా వన్డేల్లో కోహ్లీ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..    
     
2) సనత్ జయసూర్య:

శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య వన్డేల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులకు గెలుచుకున్న ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో దిగ్గజ క్రికెటర్ గా పేరొందిన జయసూర్య 1990 దశాబ్దంలో తిరుగులేని ప్లేయర్ గా నిలిచాడు. ఓవరాల్ గా 445 మ్యాచ్ ల్లో 48 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. పవరే ప్లే లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి ఎన్నో విజయాలలో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో 13 వేలకు పైగా పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో 300 పైగా వికెట్లు తీసుకొని ఎవరికీ సాధ్యం కానీ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

1) సచిన్ టెండూల్కర్ 

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. పరుగులు, మ్యాచ్ లు, హాఫ్ సెంచరీలలో అగ్రస్థానంలో నిలిచాడు. వన్డేల్లో సచిన్ తన బ్యాటింగ్ తో ఒంటి చేత్తో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఈ క్రమంలో 463 మ్యాచ్‌ల్లో 62 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో మొదటి స్థానంలో నిలిచాడు. వన్డేల్లో సచిన్ ఓవరాల్ గా 463 మ్యాచ్ ల్లో 18426 పరుగులు చేశాడు. వీటిలో 49 సెంచరీలతో పాటు 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.