డ్రగ్స్ రహిత కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చుకుందాం : కలెక్టర్ చిత్రా మిశ్రా 

డ్రగ్స్ రహిత కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చుకుందాం : కలెక్టర్ చిత్రా మిశ్రా 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్, వెలుగు: కలిసికట్టుగా డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా నిర్మూలించి, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదర్శంగా నిలుపుదామని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్  కమిటీ సమావేశంలో సీపీ  గౌస్ ఆలంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలిస్తున్నాయన్నారు.

డాక్టర్లు చీటీ లేకుండా మత్తు కలిగించే మెడిసిన్‌‌‌‌‌‌‌‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం తదితర అంశాల్లో ఇటీవల 5  కేసులు నమోదు చేయడంతో పాటు  10 మందిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ, ఆర్డీవోలు కె.మహేశ్వర్, రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, యాంటీ నార్కోటిక్స్ టీం ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రఫీక్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.