వివాదంలో సీఎం సిద్ధరామయ్య కొడుకు

వివాదంలో సీఎం  సిద్ధరామయ్య కొడుకు
  • తండ్రితో యతీంద్ర మాట్లాడిన వీడియో వైరల్ 
  • ట్రాన్స్ ఫర్లకు లంచం తీస్కున్నరని కుమారస్వామి ఆరోపణలు 

బెంగళూరు : కర్నాటక సీఎం సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తన తండ్రితో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. జేడీఎస్ లీడర్ కుమారస్వామి ఆ వీడియోను గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేసి.. యతీంద్రపై అవినీతి ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్యతో యతీంద్ర ఫోన్ లో మాట్లాడుతూ.. ‘‘హలో అప్పా.. వివేకానంద ఎక్కడిది? నేను ఆ పేరు ఇవ్వలేదు కదా? నేను నాలుగైదు పేర్లే ఇచ్చాను. అవి మాత్రమే చేయండి” అని అన్నట్టుగా ఉంది. అయితే ఏ అంశానికి సంబంధించి సిద్ధరామయ్యతో యతీంద్ర మాట్లాడారనేది క్లారిటీ లేదు.

ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసిన కుమారస్వామి.. అధికారుల బదిలీల కోసం యతీంద్ర లంచం తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు ఆ లిస్టు ఏంటి? అందులో వివేకానంద ఎవరు? అని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ కూడా సిద్ధరామయ్య సర్కార్ పై ఫైర్ అయింది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

సిద్ధరామయ్య డమ్మీ సీఎం అని, అధికారమంతా ఆయన కొడుకు చేతుల్లోనే ఉందని విమర్శించింది. అయితే, తన కొడుకుపై కుమారస్వామి తప్పుడు ఆరోపణలు చేశారని సిద్ధరామయ్య మండిపడ్డారు. డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.