సిద్ధరామయ్యపై పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా

సిద్ధరామయ్యపై పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా

కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్యను విమర్శించే సిద్ధు నిజ కనసుగలు( ది రియల్ డ్రీమ్స్ ఆఫ్ సిద్ధరామయ్య)అనే పుస్తకాన్ని బీజేపీ కార్యకర్తలు ఆవిష్కరణను వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిరసన చేపట్టింది. బెంగళూరులోని కాంగ్రెస్ భవన్ బయట కేపీసీసీ నిరసనకు దిగింది. బీజేపీ చీఫ్ ట్రిక్స్ లకు భయపడబోమని...ఇది దుష్టవ్యూహం తప్ప మరొకటి లేదని తెలిపింది. ఈ పుస్తకాన్ని నిన్న బెంగళూరులోని టౌన్ హాలు ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు ఆవిష్కరించాల్సి ఉంది. కేపీసీసీ సభ్యులు,సిద్ధరామయ్య మద్దతుదారులు వెబ్ సైట్ లో ప్రారంభించడాన్ని నిరసించడంతో బీజేపీ ఈ ప్రొగ్రామ్ ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. 

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యను కించపరిచేలా పుస్తకాన్ని విడుదల చేయడం ద్వారా బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని కేపీసీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకావిష్కరణను నిలిపివేయాలని అధికారులను కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. రామలింగారెడ్డి, సిద్ధరామయ్యతోపాటు కాంగ్రెస్ మద్దతు దారులు పాల్గొన్నారు.