బెంగళూరు ఐటీ ఉద్యోగ సంఘాల ఉద్యమం.. కారణం ఇదే..

బెంగళూరు ఐటీ ఉద్యోగ సంఘాల ఉద్యమం.. కారణం ఇదే..

కర్ణాటక రాష్ట్రంలోని ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు బెంగుళూరులోని లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు మార్చి 16 నుంచి నిరసనకు దిగారు. ఆ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం నుంచి ఐటీ, ఐటీఈఎస్ సెక్టర్ ఉద్యోగులను మినహహించడాన్ని వ్యతిరేకిస్తూ, ఆ మినహాయింపును నిలిపివేయాలని కేఐటీయూ ఎంప్లాయిస్ గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తు్న్నారు. కేఐటీయూ అధ్యక్షుడు వీజేకే నాయర్‌, ప్రధాన కార్యదర్శి సూరజ్‌ నిడియంగ లేబర్‌ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 

కర్ణాటకలో 20లక్షల కంటే ఎక్కువ మంది ఎంప్లాయిస్ ఉన్న ఐటీ,ఐటీఈఎస్  రంగం ఇండస్టియల్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ నుంచి ఇప్పటి వరకు నాలుగు స్లారు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మినహాయింపును సవాల్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు నిడియంగ తెలిపారు.

IT, ITeS, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ మరియు నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ సంస్థలకు కార్మిక నిబంధనల నుండి కర్ణాటక మినహాయింపులను మంజూరు చేసింది. జనవరి 25, 2014న, రాష్ట్ర ప్రభుత్వం ది ఇండస్ట్రియల్ ఎంప్లాయ్‌మెంట్ (స్టాండింగ్ ఆర్డర్) యాక్ట్, 1946 నుండి కంపెనీలను మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మినహాయింపు మే 25, 2019న అదనంగా ఐదేళ్లపాటు పొడిగించబడింది. కాగా, కర్ణాటకలోని ఈ విభాగంలోని కంపెనీలను రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ప్రస్తుతం కర్ణాటకలోని 8,785 ఐటీ/బీటీ సంస్థలలో దాదాపు 18 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు.