కర్ణాటకలో కొత్తగా 34 JN.1 కేసులు, 3మరణాలు నమోదు

కర్ణాటకలో కొత్తగా 34 JN.1 కేసులు, 3మరణాలు నమోదు

దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో. కర్ణాటకలో కొవిడ్-19 కొత్త సబ్-వేరియంట్ జేఎన్ 1(JN.1) 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 436కి చేరుకుందని హెల్త్ బులెటిన్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంటువ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయపడవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు విజ్ఞప్తి చేశారు.

డిసెంబర్ 25న కర్ణాటకలో 24 గంటల్లోనే మొత్తం 125 కొవిడ్ -19 కేసులు, మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో, 30 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు, మొత్తం 3,155 పరీక్షలు నిర్వహించారు. 2వేల 72 RT-PCR, 1,083 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివిటీ రేటు 3.96 శాతంగా ఉందని, మరణాల రేటు 2.4 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.