
లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కూతురుతో కలిసి యడ్యూరప్పకు ఇంటికి వెళ్లినపుడు ఆయన తన కూతరుపై అత్యాచారం చేశారని 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యడ్యూరప్పపై పోక్సో చట్టం, ఐపీసీ లోని సెక్షన్ 354(ఏ) కింద లైంగిక వేధింపుల కింద అభియోగాలు మోపారు.
యడ్యూరప్ప తన న్యాయవాదుల ద్వారా, సిఐడి ముందు హాజరు కావడానికి ఒక వారం టైమ్ కావాలని కోరారు. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పటికే విచారణ బృందం యడియూరప్పకు మూడుసార్లు విచారించింది. ఆయనకు నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి.
తొలుత సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లోఈ కేసు నమోదు కాగా తదుపరి విచారణ నిమిత్తం సీఐడీకి బదిలీ చేశారు. అయితే ఈ ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు, అవి నిరాధారమైనవి అని పేర్కొన్నారు. ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. యడియూరప్పపై అభియోగాలు మోపిన 54 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో గత నెలలో ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.