వివాదంలో రింకు సింగ్.. హిందు దేవుళ్లను కించపర్చాడంటూ పోలీసులకు కర్ణిసేన కంప్లైంట్

వివాదంలో రింకు సింగ్.. హిందు దేవుళ్లను కించపర్చాడంటూ పోలీసులకు కర్ణిసేన కంప్లైంట్

లక్నో: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. హిందూ దేవతలను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ అతడిపై కర్ణి సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన రింకు సింగ్‎పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని సస్ని గేట్ పోలీసులు తెలిపారు. 

వివాదం ఏంటంటే..?

ఇండియా, న్యూజిలాండ్ టీ20 సిరీస్‎కు ముందు రింకు సింగ్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ పోశాడు. ఏఐతో రూపొందించిన ఈ వీడియోలో హనుమంతుడు, శివుడు, వినాయకుడు వంటి హిందూ దేవుళ్లు సన్ గ్లాసెస్ ధరించి కారులో వెళ్తుంటారు. హనుమంతుడు కార్ డ్రైవ్ చేస్తుండగా శివుడు, వినాయకుడు కారులో ఇంగ్లీష్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

Also Read : స్టార్క్ రిటైర్మెంట్.. కమ్మిన్స్‌కు గాయం

ఈ వీడియోపై కర్ణి సేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ దేవతలను సన్ గ్లాసెస్ ధరించి వాహనం నడుపుతున్నట్లు చిత్రీకరించి అగౌరవపర్చారని మండిపడ్డారు. రింకు పోస్ట్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని..మత విశ్వాసాలను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రింకు సింగ్‎పై చర్యలు తీసుకోవాలని కర్ణి సేన నేత సుమీత్ తోమర్ సస్ని గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరీ రింకుపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలీ.