
కర్నూలు జిల్లా నందికొట్కూర్ మండలం బొల్లవరం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఏసీ గోడౌన్ లో షాట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అలర్టయిన ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించి నివారణ చర్యలు చేపట్టారు.