అమీర్, అక్షయ్లను వెనక్కి నెట్టిన నిఖిల్

అమీర్, అక్షయ్లను వెనక్కి నెట్టిన నిఖిల్

ఈ నెల 13న విడుదలైన కార్తికేయ 2 హిట్ టాక్తో దూసుకెళ్తోంది. మైథలాజికల్ అడ్వెంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఆడియెన్స్ను మెప్పిస్తోంది ఈ మూవీ. బాలీవుడ్లో కార్తికేయ 2 లిమిటెడ్ స్క్రీన్స్ తో రిలీజ్ అవ్వగా అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ కలెక్షన్స్ 300శాతం జంప్ అయి లాల్ సింగ్ చద్దా, రక్షబంధన్ మూవీలు కూడా అందుకోలేని ఫీట్ను సాధించింది. కార్తికేయ 2 ట్రెండ్పై  ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 

శనివారం ఈ మూవీ 7లక్షలు వసూల్ చేయగా..ఆదివారం 28 లక్షలు వసూల్ చేసినట్లు తరణ్ ఆదర్శ్ తెలిపారు. బాలీవుడ్లో రీసెంట్ రిలీజైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ చిత్రాలు బాక్సాఫీస్ ను మెప్పించలేకపోయాయి. అయితే అనూహ్యంగా కార్తికేయ 2 బాలీవుడ్ లో సత్తా చాటుతుండడం విశేషం. అటు యూఎస్లోనూ ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. తొలిరోజే ఈ మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

కాగా చందూ మొండేటి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ ఓ కీలక పాత్రలో నటించారు. గతంలో వచ్చి హిట్ కొట్టిన కార్తికేయ మూవీకి సీక్వేల్ గా ఈ మూవీ తెరకెక్కింది. అయితే కార్తికేయలాగే సీక్వేల్ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.