డిఫరెంట్ దొంగగా కార్తి

డిఫరెంట్ దొంగగా కార్తి

‘ఖైదీ’ సినిమాతో తమిళంలోనే కాదు, తెలుగునాట కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు కార్తి. అతని నెక్స్ట్‌ మూవీ కూడా అలాగే అలరిస్తుందంటున్నారు హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్. కార్తి హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు రైట్స్‌‌ను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ . యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉన్నాయిందులో. టీజర్​కి, సాంగ్స్‌‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జ్యోతిక గారు కార్తికి అక్కగా నటించడం విశేషం. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గోవింద్ వసంత మ్యూజి క్, ఆర్‌.డి. రాజశేఖర్ విజువల్స్ హైలైట్. తెలుగులో విడుదల చేసే అవకాశం కల్పించిన వయాకామ్‌‌ 18 స్టూడియోస్‌‌, ప్యారలల్‌ మైండ్స్‌‌ సంస్థలకి, కార్తి గారికి ధన్యవాదాలు. డిసెంబర్ 20న గ్రాండ్‌‌గా విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.