BONALU 2025: ఘనంగా బోనాల జాతర: కట్టమైసమ్మకు మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కోదండరాం, డిప్యూటీ మేయర్ శ్రీలత

BONALU 2025: ఘనంగా బోనాల జాతర: కట్టమైసమ్మకు మొక్కులు చెల్లించుకున్న  ఎమ్మెల్సీ కోదండరాం, డిప్యూటీ మేయర్ శ్రీలత

ట్యాంక్ బండ్, వెలుగు: జీహెచ్ఎంసీ ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని కట్ట మైసమ్మ దేవాలయం వద్ద బోనాల వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్సీ కోదండరాం, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్ రెడ్డి హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఔట్​ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, టీజేఎస్​ నగర అధ్యక్షుడు ఎం.నరసయ్య, మెరుగు శ్రీనివాస్ యాదవ్, లక్ష్మి, పల్లె వినయ్, సలీం తదితరులు పాల్గొన్నారు.