అలంపూర్, వెలుగు: పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అలంపూర్ పరిధిలోని క్యాతూరు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయానికి రైతులు బుధవారం తాళం వేశారు. గతేడాది డిసెంబర్‌లో గద్వాల జిల్లాలో తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. 306 మంది రైతులకు సంబంధించిన రూ.4 కోట్ల 3 లక్షల 98 వేల 58 చెల్లించాల్సి ఉంది. కొనుగోలు జరిగి రెండు నెలలు గడిచినా డబ్బులు రాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శిని కార్యాలయంలో ఉంచి తాళం వేసి ఆందోళన చేపట్టారు.
