రూ.125.6 కోట్ల బై బ్యాక్ ప్లాన్‌‌ను ప్రకటించిన కావేరి సీడ్‌‌ కంపెనీ

రూ.125.6 కోట్ల బై బ్యాక్ ప్లాన్‌‌ను ప్రకటించిన కావేరి సీడ్‌‌ కంపెనీ
  • ప్లాన్ సైజ్‌‌‌‌  రూ. 125.6  కోట్లు
  • షేరుకి రూ.700  చెల్లించడానికి రెడీ

హైదరాబాద్, వెలుగు​: కావేరి సీడ్‌‌ కంపెనీ  రూ.125.6 కోట్ల బై బ్యాక్ ప్లాన్‌‌ను ప్రకటించింది. షేరుకి రూ.700 దగ్గర  బై బ్యాక్ చేయాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. బై బ్యాక్ ప్లాన్ ఉండడంతో గురువారం కావేరి సీడ్‌‌ కంపెనీ షేర్లు బీఎస్‌‌ఈలో 6 శాతం పెరిగి రూ. 483 వద్ద క్లోజయ్యాయి. ‘ గురువారం జరిగిన మీటింగ్‌‌లో ఫేస్ వాల్యూ రూ. 2 ఉన్న ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్లను రూ.125.6 కోట్లు పెట్టి బై బ్యాక్ చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది’ అని కంపెనీ ఎక్స్చేంజి ఫైలింగ్‌‌లో పేర్కొంది.

కాగా, కంపెనీ మొత్తం పెయిడ్‌‌ అప్ షేర్లలో తాజాగా బైక్ బ్యాక్ ద్వారా కొనాలని చూస్తున్న షేర్ల వాటా 9.85 శాతానికి సమానం. కావేరి సీడ్ కంపెనీ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 16 శాతం డౌన్ అవ్వగా, గత ఏడాది కాలంలో 9 శాతం తగ్గాయి. చివరి సారిగా  కిందటేడాది ఆగస్టులో రూ. 120 కోట్లతో బై బ్యాక్‌‌ను కంపెనీ చేపట్టింది. ఓపెన్ మార్కెట్ విధానంలో ఈ ప్రాసెస్‌‌ను పూర్తి చేసింది. కాగా, షేర్ల బై బ్యాక్ అంటే ఇప్పటికే ఉన్న షేరు హోల్డర్ల నుంచి మార్కెట్ రేటు కంటే ఎక్కువ చెల్లించి షేర్లను కంపెనీనే తిరిగి కొనుగోలు చేయడం.