
- వెంటనే రీమెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి: కవిత
- సంస్థ సీఎండీ బలరాం నాయక్‌కు వినతిపత్రం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలని హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అలాగే, దసరాకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వాలని కోరారు. శుక్రవారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, కార్మిక నాయకులు, కార్మిక కుటుంబాలతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ను కలిసి పలు సమస్యల పై మెమోరాండం ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.
అలియాస్ పేర్లతో ఉద్యోగంలో చేరిన నలుగురు కార్మికులను డిస్మిస్ చేయడం దారుణమని.. వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మెడికల్ బోర్డు వల్ల నష్టపోయిన 54 మంది కార్మికుల వారసుల కోసం రీ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, గతంలో మాదిరిగా నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలన్నారు.