ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా : కవిత

ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా : కవిత
  • ఇప్పటివరకు పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలే: కవిత

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఏర్పాటుపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుతం జాగృతి బలోపేతం కోసం పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో సోమవారం లండన్​లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. అనంతరం తనకు పార్టీలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.