హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచుల సందర్భంగా ఆ జట్టు కంటే ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఎక్కువగా హైలెట్ అవుతుంటారు. ఎస్ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు స్టేడియానికి వచ్చి ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తుంటారు కావ్య. ఈ క్రమంలోనే స్టేడియంలో ఆమె పలికించి హావభావాలు కూడా నెట్టంట తెగ వైరల్ అవుతుంటాయి.
ఐపీఎల్ 19 లీగ్ దశలో భాగంగా ఉప్పల్ వేదికగా శుక్రవారం (మే 22) ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్లు తలపడ్డ మ్యాచ్‌లో కూడా ఆర్‌సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌పై కావ్య మారన్ స్పందించిన తీరు వైరల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైక్‌లో ఉండగా కృనాల్ పాండ్యా వేగంగా బౌన్సర్ విసిరాడు. స్పిన్నరైన కృనాల్ ఫాస్ట్ బౌలర్ మాదిరిగా బౌన్సర్ విసరడంతో కావ్య పాప ఆశ్చర్యపోయింది.
వెంటనే పక్కనే ఉన్న హీరో వెంకటేష్ దగ్గరకు వెళ్లి ఆదేం బౌలింగ్ వెంకీ మామ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. కృనాల్ బౌలింగ్‌పై వెంకటేష్‌తో మాట్లాడుతూ కావ్య పాప ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కావ్య పాప ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటూ కొందరు పొగుడుతుండగా.. పాపం కావ్య పాప కృనాల్ బౌన్సర్‌కు భయపడ్డదని ఇంకొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్–19 లీగ్ దశను విజయంతో ముగించింది. ఇషాన్ కిషన్ (46 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), అభిషేక్ శర్మ (22 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56), హెన్రిచ్ క్లాసెన్ (24 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్ 55 రన్స్ తేడాతో బెంగళూరుపై గెలిచింది.
టాస్ గెలిచిన హైదరాబాద్ 20 ఓవర్లలో 255/4 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో బెంగళూరు 20 ఓవర్లలో 200/4 స్కోరు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (19 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), రజత్ పటీదార్ (39 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) మెరుగ్గా ఆడారు. ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
Kavya Maran reaction to Krunal Pandya bowling action was priceless 😭😂
— Rohan💫 (@rohann__45) May 22, 2026
She didn’t look happy with it.
That “yeh kya daal raha hai bhai?” expression was too funny 🤣 pic.twitter.com/WYPeU4Nbsj
