కాజీపేట, వెలుగు: టెన్త్ ఫలితాల్లో కాజీపేటలోని నాగేశ్వరరావుహై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఎం.బిందుసిరి, కె.సాయివినీల్ 600కు 588 మార్కులు సాధించి స్కూల్ టాపర్లుగా నిలించారు. డి.అమాత్యకృష్ణ 578, జి.జనహిత్ విహార్ 576, ఎం.శ్రీలక్ష్మీ ప్రణతి 576, బి.సాయిఅఖిల్ 576 మార్కులు సాధించారు. స్కూల్ నుంచి 48 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 31 మంది 90శాతానికిపైగా మార్కులు పొందారు.
ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ పి.రాజేంద్ర కుమార్, డైరెక్టర్ పి.రేణుక మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఫలితాలు పాఠశాలకు గౌరవాన్ని తెచ్చిపెట్టాయన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ వి.విక్రాంత్, వైస్ ప్రిన్సిపల్ ఏ.సంధ్య, ఇతర టీచర్లు అభినందించారు.

