హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే విధానం మూడో రోజుకు చేరుకోగా, గురువారం వాహనాలు ఈజీగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకున్నాయి. వన్‌వే సక్సెస్ చేయాలనిమొదటి నుంచీ పట్టుదలతో పని చేస్తున్న సిటీ పోలీస్బాస్సజ్జనార్ గురువారం సివిల్‌డ్రెస్‌లో బైక్‌పై వెనక కూర్చుని పార్కు చూట్టూ రౌండ్స్కొట్టారు. రెండుసార్లు కేబీఆర్‌చుట్టూ తిరిగిన ఆయన రోడ్ నంబర్ 45 నుంచి ఫిల్మ్‌నగర్ వరకు ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ తీరుతెన్నులను పరిశీలించారు.
దారి పొడవునా వివిధ జంక్షన్లలో డ్యూటీలో ఉన్న పోలీసులతో మాట్లాడి ఎలా సాగుతోందని వివరాలు తెలుసుకున్నారు. వన్‌వే అమల్లోకి వచ్చిన మొదటి రోజు వాహనదారుల్లో కొంత అయోమయం ఉందని, మూడో రోజుకు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని సీపీ తెలిపారు. అన్ని ప్రధాన జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. హెచ్-సిటీ పనులను జీహెచ్‌ఎంసీ నిర్మాణ సంస్థల సమన్వయంతో వేగవంతం చేస్తున్నామన్నారు.
