అరుణ్‌ గోయెల్‌ రాజీనామా ఆశ్యర్యానికి గురిచేసింది : కేసీ వేణుగోపాల్

 అరుణ్‌ గోయెల్‌ రాజీనామా ఆశ్యర్యానికి గురిచేసింది :  కేసీ వేణుగోపాల్

ఢిల్లీ లోక్ సభ ఎన్నికలకు ముందు జాతీయ ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్‌ గోయెల్‌ తన పదవికి రాజీనామా  చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయం తనను ఆశ్యర్యానికి గురిచేసిందని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. ఇప్పుడు సీఈసీలో ఒక్క కమిషనర్ మాత్రమే మిగిలారని చెప్పారు. ఎన్నికల సంఘంలో ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు స్వేచ్చగా నిష్పక్షపాతంగా జరగాలని కేంద్రం ప్రభుత్వం కోరుకోవట్లేదని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. 

ఇండిపెండెంట్ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కూడా కేంద్ర ప్రభుత్వంపై కేసీ వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఎజెండాకు అనుగుణంగా ఉన్న వ్యక్తులను మన దేశ ఫండమెంటల్ సంస్థల్లో నియమించడం ద్వారా వాటిని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కబిల్ సిబల్ ఆరోపించారు.

కాగా  ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే ఆమోదం తెలిపారు. శనివారం నుంచే రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అరుణ్‌ గోయెల్‌ రాజీనామాకు కారణాలు మాత్రం తెలియరాలేదు.