సంక్రాంతి వేడుకలను కుటుంబంతో కలిసి ఘనంగా జరుపుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన వేడుకల్లో సంప్రదాయ బద్ధంగా పండుగ జరుపుకున్నారు. గొబ్బెమ్మలు, నవ ధాన్యాలు, చెరుకు గడెలతో అలంకరించిన సంక్రాంతి ముగ్గు ఆకర్శనీయంగా కనిపించింది.
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కేటీఆర్, ఆయన సతీమణి, కొడుకుతో కలిసి ఎర్రవల్లి చేరుకున్నారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కొడుకు కేటీఆర్, కోడలు, మనవడు కలిసి పండుగను జరుపుకున్నారు.
అయితే ఈ వేడుకలకు కవిత దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సంక్రాంతికి తంల్లిదండ్రులతో గడిపే కవిత కుటుంబం ఈ సారి ఎర్రవల్లికి వెళ్లలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఉన్న కవిత.. కుటుంబానికి కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అందులో భాగంగానే ఎర్రవల్లి క్షేత్రానికి వెళ్లలేదని తెలుస్తోంది.
