జనగామ జెడ్పీ ఛైర్మన్‌ సంపత్‌రెడ్డి మృతిపట్ల కేసీఆర్ సంతాపం

జనగామ జెడ్పీ ఛైర్మన్‌ సంపత్‌రెడ్డి మృతిపట్ల కేసీఆర్ సంతాపం

జనగామ జెడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అకస్మిక మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.  సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన వెంట ఉన్న సంపత్ రెడ్డి మరణించడం బాధాకరమని ఆయన అన్నారు. కేసీఆర్ తోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా సంపత్‌రెడ్డి మృతిపట్ల సంతాపం తెలుపుతూ విచారం వ్యక్తం చేశారు.

డిసెంబర్ 4వ తేదీ సోమవారం పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయనకు ఈరోజు సాయంత్రం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. సంపత్‌రెడ్డి ఆకస్మిక మృతికి పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.