వాసాలమర్రికి దళితబంధు నిధులు విడుదల

వాసాలమర్రికి దళితబంధు నిధులు విడుదల

సీఎం దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 7 కోట్ల 60 లక్షలు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు అధికారులు. SC అభివృద్ధి శాఖ పేరుతో నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించారు సీఎం కేసీఆర్. దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు సీఎం.  

వాసాలమర్రిలో దళిత బంధును సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా మొదలుపట్టినట్టు తెలుస్తోంది. ఆగస్టు 16న హుజురాబాద్ లో ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సడెన్ గా సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన ఫిక్స్ అయింది. నిన్న అక్కడికి వెళ్లిన ముఖ్యమంత్రి వాసాలమర్రిలోనే దళిత బంధు ఇస్తున్నట్టు ప్రకటించారు. హుజురాబాద్ లో దళిత బంధుకు బ్రేక్ పడకుండా..ముందుజాగ్రత్తగానే వాసాలమర్రిలో స్కీం ప్రారంభించినట్టు చెప్పడమే కేసీఆర్ టార్గెట్. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ గా చెప్పేందుకే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కీమ్ పై ఎలక్షన్ కమిషన్ వివరణ కూడా కోరింది.