త్వరలో ‘కేసీఆర్ న్యూట్రియంట్​ కిట్’

త్వరలో ‘కేసీఆర్ న్యూట్రియంట్​ కిట్’
  • గర్భిణులకు ‘కేసీఆర్ న్యూట్రియంట్​ కిట్’
  • డెలివరీ వరకు రెండుసార్లు ఇస్తరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గర్భిణుల్లో రక్తహీనత(ఎనిమీయా) తగ్గించేందుకు, బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు పోషకాహార కిట్​ అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ‘కేసీఆర్ న్యూట్రియంట్ కిట్’ పేరుతో ఈ స్కీమ్ త్వరలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం బీఆర్​కే భవన్​లో హెల్త్ ఆఫీసర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ రివ్యూ నిర్వహించారు. స్కీమ్ విధివిధానాలపై చర్చించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ప్రకారం రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మహిళల్లో 56.6% మంది ఎనిమీయాతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో సర్కారు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డను కనే వరకు రెండు సార్లు ఈ కిట్​ను అందించనున్నారు.