గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించిన కేసీఆర్

గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించిన కేసీఆర్

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా గన్ పార్క్ అమరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. అమరుల త్యాగాలను గుర్తి చేసుకున్నారు. గన్ పార్క్ నుంచి క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు సీఎం. అక్కడ జాతీయ జెండాను ఎగరవేస్తారు.  పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. డీజీపీ, సీఎస్.. పలువురు మంత్రులు వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో అధికారులకు తేనీటి విందు ఇవ్వనున్నారు సీఎం.

రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు.. ప్రజలు తమవంతుగా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. సవాళ్లను అధిగమించి రాష్ట్రం పురోగమిస్తోందని చెప్పారు తమిళిసై.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కేసీఆర్ సర్కార్ కృషి చేస్తుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ఆయన జాతీయ జెండా  ఎగురవేశారు.6 ఏళ్లలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు పోచారం.