మనకు ఢిల్లీలో దోస్తులు, దుష్మన్లు ఎవరూ లేరు : KCR

మనకు ఢిల్లీలో దోస్తులు, దుష్మన్లు ఎవరూ లేరు : KCR

TRS ఎంపీల పెర్ఫార్మెన్స్ బాగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. గురువారం పార్లమెంటరీ మీటింగ్ ఇంటర్నల్ లో మాట్లాడిన సీఎం..ఢిల్లీలో తమకు ఎవరితోనూ ఫ్రెండ్ షిప్ లేదు.. శతృత్వం లేదన్నారు. లాస్ట్ 5 ఏళ్లల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమి రాలేదని..ఈ సారి తప్పనిసరిగా మన నిధులు రాబట్టాలని ఎంపీలకు తెలిపారు. రెగ్యులర్  గా రావాల్సిన నిధులు వస్తే సరిపోదని.. మరిన్ని నిధులు రాబట్టాలన్నారు. భారీ మెజార్టీతో  గెలిచిన BJP ఇతర పార్టీలను చిన్న చూపు చూసే అవకాశం ఉందని తెలిపారు. TRS ఎంపీలు ఓపికగా కేంద్రంతో మెలగాలని..BJP పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇచ్చుకుంటారని తెలంగాణకు కూడా నిధుల కోసం పట్టు బట్టాలన్నారు. అంశాల వారీగా కేంద్రంతో వ్యవహారం నడిపిస్తామన్న కేసీఆర్..పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు పొందించుకోవాలన్నారు. అవసరాలకు అనుగుణంగా పక్క రాష్ట్రాల మద్దతు కూడా తీసుకుంటామని చెప్పారు.

రెగ్యులర్ గా పార్లమెంట్ కు వెళ్ళాలి

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన సీఎం..తెలంగాణ ప్రయోజనాలు అన్న ఒక్క ఎజెండాతోనే ఎంపీలు పని చేయాలన్నారు. కొత్త ఎంపీలు పార్లమెంట్ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్.