ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ యాదాద్రి

ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ యాదాద్రి

ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ గా యాదాద్రి మారుతుందన్నారు సీఎం కేసీఆర్. కృష్ణశిలలతో టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతంగా జరుగుతుందన్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను క్షణ్ణంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణాలు మొత్తం పూర్తయ్యాకే దివ్యక్షేత్రం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

యాదగిరి లక్ష్మినరసింహుని సన్నిధి అద్భుతమైన దివ్యక్షేత్రమన్నారు సీఎం కేసీఆర్. వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. క్లిష్టమైన పనులు పూర్తయ్యయాని చెప్పిన సీఎం.. మిగిలిన పనుల్లోనూ వేగం పెంచుతామన్నారు. నిర్మాణాలు మొత్తం పూర్తయ్యాకే లక్షలాది మంది భక్తులతో అత్యంత వైభవంగా ఆలయ పునప్రతిష్టాపన నిర్వహిస్తామన్నారు.

సమైక్య రాష్ట్రంలో మన ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు కేసీఆర్. చినజీయర్ స్వామి సూచనలు, ఆగమ శాస్తం ప్రకారమే ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. అద్భుతమైన కృష్ణశిలలు వాడుతున్నామన్నారు. రెండు లక్షల మంది కూర్చునేలా కల్యాణమండపం నిర్మిస్తామన్నారు. నిత్యాన్నదాన సత్రాలు, కాటేజీల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారని చెప్పారు ముఖ్యమంత్రి.

రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి యాదాద్రికి వచ్చిన కేసీఆర్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్మాణ పనులను పరిశీలించారు.