దేశానికే పాఠం నేర్పే గొప్ప సిద్ధాంతానికి శ్రీకారం చుట్టాం

దేశానికే పాఠం నేర్పే గొప్ప సిద్ధాంతానికి శ్రీకారం చుట్టాం

దేశానికి ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. బీజేపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని సీపీఎం పెద్దలు చెప్పారన్నారు. పార్టీల పునరేకీకరణ అవసరం లేదన్న కేసీఆర్.. చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా మారొచ్చని చెప్పారు. నూతన ఆర్థిక, పారిశ్రామిక వ్యవసాయ విధానాలతో పాటు దేశానికి ప్రస్తుతం కావాల్సింది అభ్యుదయ పథం, ఆచరించాల్సిన మార్గం అని అన్నారు. రాష్ట్రం నుంచి కొత్త సిద్ధాంతం మొదలైతే తమకే గర్వకారణమని.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేయాలని ఎమ్మెల్యే కిషోర్ రాశారన్నారు. దళితబంధు పథకం దేశానికే కాదు..  ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం నుంచి ఎవరూ వలసలు పోవడం లేదని.. 11 రాష్ట్రాల నుంచి తెలంగాణకే వలసలు వస్తున్నారని అన్నారు. కరోనా టైంలో వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసి వారిని స్వస్థలాలకు పంపించామన్నారు.